న్యూస్ ఛానళ్ల బుల్లి తెరపై భక్తి రసం


న్యూస్ చానళ్లు ప్రారంభమైన మొదట్లో భక్తికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ భక్తికి ఉన్న మార్కెట్ చూశాక.. ఛానళ్ల కళ్లు తెరుచుకున్నాయి. క్రమంగా భక్తికి ఇచ్చే ప్రాధాన్యతా పెరిగింది. ఉదయం వేళల కార్యక్రమాలతో మొదలైన ఈ భక్తి హవా.. ఆ తర్వాత ప్రైమ్ టైమ్ కూ పాకింది. ఇదే అదనుగా కొన్ని ఛానళ్లు కొందరు స్వాములను టైమ్ స్లాట్లు కూడా అమ్మేసుకుంటున్నాయి. 

ఇక సీజన్లవారీగా కూడా న్యూస్ ఛానళ్లు బుల్లి తెరపై భక్తి రసం పారిస్తున్నాయి. ఈ సందడి కార్తీక మాసంలో మరీ ఎక్కువ. కార్తీక దీపంలో దీపాల సందడి తెలిసిందే. దీన్నే అస్త్రంగా మలచుకుంటున్నాయి ఛానెళ్లు. మొదట్లో ఈ ట్రెండ్ ఎన్టీవీ మొదలు పెట్టిందని చెప్పాలి. కోటి దీపోత్సవం పేరుతో భారీగా దీపోత్సవం నిర్వహించి సక్సస్ చేసింది. ఆ తర్వాత అదే బాటలోకి టీవీ 5 కూడా వచ్చింది. 

ఇప్పుడు ఈ రెండు చానళ్లు పోటాపోటీగా భక్తి కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. భారీ ఏర్పాట్లతో కోటి దీపోత్సవాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ స్వామీజీలను ముఖ్య అతిధులుగా రప్పించుకుని భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఐతే.. సాధారణంగా ఇలాంటి హంగామాలకు దూరంగా ఉండే ఈటీవీ న్యూస్ ఛానళ్లు కూడా ఇప్పుడు వీటి దారిలోనే  పయనిస్తున్నాయి. 

అటు ఆంధ్రాలోనూ.. ఇటు తెలంగాణలోనూ దీపోత్సవాలు నిర్వహిస్తోంది ఈటీవీ. ఎన్టీవీ, టీవీ5 స్థాయిలో భారీగా, హంగామాగా నిర్వహించకపోయినా.. ఈటీవీ కూడా ఈ దీపోత్సవాలు బాగానే నిర్వహిస్తోంది. విశేషమేమంటే.. వార్తలకు ముఖ్యమైన  ప్రైమ్ టైమ్ లో వార్తలను నిలిపేసి మరీ ఈ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. వార్తా ఛానళ్లు.. వార్తలను కూడా పక్కకు పెట్టి ఇలాంటి భక్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నాయంటే.. రాబడి ఆ స్థాయిలో ఉన్నట్టే కదా. http://www.apherald.com సౌజన్యం తో 

0 కామెంట్‌లు :: న్యూస్ ఛానళ్ల బుల్లి తెరపై భక్తి రసం

కామెంట్‌ను పోస్ట్ చేయండి