వెబ్ ఛానల్స్ దందా

0 కామెంట్‌లు
వెబ్ ఛానల్స్ దందా 

శాటి లైట్ పేర్లకు దగ్గరగా పేర్లు పెట్టుకొని ..వెబ్ చానళ్ళను మొదలు పెట్టి.. అక్రమ సంపాదనకు తెర లేపారు..ఇరు రాష్ట్రాలలో తమ చానెల్ ప్రసారాలు మొదలవుతాయని మాయ మాటలు చెప్పి.. డిపాజిట్ ల పేరుతో.. జిల్లాల నుంచి.. లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు..
             అటు ఆంద్రా ఇటు ....తెలంగాణాలో.. 15 లక్షల వరకు వసూల్ చేసినట్టు సమాచారం  ..గతంలో చిన్న చిన్న కేబుల్ టీవీలలో పనిచేసిన కొందరు.. గ్రూపులుగా ఏర్పడి ...అక్రమ వసూళ్ళ దందా మొదలు పెట్టారు ...మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు..స్కూళ్ళ  పర్మిషన్స్ లేని వాళ్ళ వివరాలు సేకరించి ...మీ విషయం  ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాం అంటూ..బెదిరింపులకు పాల్పడుతూ.. అందిన కాడికి  దోచుకుంటున్నారు ... కనీసం.. న్యూస్ బులెటిన్స్ కూడా ఇవ్వకుండా.. తమ చానల్ శాటి లైట్   చానల్ అని భ్రమింప చేసి.. డబ్బులు వసూల్లు చేస్తున్నారు... లేడీ రిపోర్టర్లను ముందుపెట్టి, వసూల్లు షురూ చేసారు. ఫేస్ బుక్ లో వీరి పేజీల్లో న్యూస్ ఎప్పుడూ  ...రిపోర్టర్లు కావాలని యాంకర్లు కావాలని మాత్రమే పోష్టులు వుంటాయి ...ప్రెషర్స్ కావాలని.. కొన్నాళ్ళు పని చేపించుకొని శాలరి ఇవ్వాల్సి  వచ్చినప్పుడు ఉద్యోగం లో  వద్దని చెప్పడం వీరి ఆనవాయితీ ... వసూల్లైన డబ్బుతో కార్లు కొని తిరుగుతు.. ఉద్యోగులకు శాలరీ ఇవ్వకుండా మాటలతో  మోసం చేస్తున్నారు ..న్యూస్ బులిటన్స్ ఉండవు..
 కాని నైట్ మాత్రం డ్రంకెన్ డ్రైవ్ లో వీరి వెహికిల్స్ ఉంటాయి వీరి పై పోలీష్టేషన్ల లో ఫీర్యాదులు వెల్లినా ఎలాగోలా బైట పడ్డారు... ఇప్పటికీ ఆ ఫిర్యాదులు ఫిర్యాదుల్లానే మిగిలిపోయాయి ..వీరి టార్గెట్ ..క్లాసి ఫైట్ యాడ్స్ పై వచ్చే ..అక్రమ సర్టిఫికేట్ దందాలు చేసేవారు... కోచింగ్ సెంటర్స్..అనుమతులు లేని స్కూల్స్, కాలేజిల లిష్టు  తయారు చేసుకున్న లిష్టులో ఫోన్స్ చేసి ..కేమేరాలతో అక్కడ వాలిపోయి ,,ఆఫీస్ అంతా రికార్ట్ చేసి బేరం మొదలు పెడతారు .. తమది వెబ్ TV ని  శాటిలైట్ అని చెప్తారు .. ఆ వెబ్ టివీ పేరు ఓ రెండు శాటిలైట్ చానల్స్ 6 పేరుకు దగ్గరగా వుండటంతొ వీరి అక్రమ దందా యదేచ్చగా జరుగుతోంది.. అదే పేర్లతో వున్న శాటిలైట్ చానల్స్ వారు అప్రమత్తం అవ్వల్సి వుంది.. లేదంటే  సదరు భాదితులు ఈ అక్రమ దందా మీరు చేస్తున్నారని బ్రమపడే  అవకాశం వుంది ..అమాయకపు ఆడపిల్లలను యాంకర్లను చేస్తామంటూ  "ఫేస్ బుక్ '' ప్రకటనలు వేస్తున్నారు... మరి ఆఫీసు లో ఏం జరుగుతోంది ? ...న్యూస్ బులిటన్స్ లేకుండా ఈ అమ్మాయిలు  ఆఫీసులో ఏం చేస్తున్నారు ?.. వసూలైన డబ్బులతో కార్లు కొంటున్నారు.. కాని  శాలరీస్ ఇవ్వడంలేదు ..మొత్తనికి ఏదో జరుగుతోంది ..దీనిపై పోలీస్ యాత్రాంగం దృష్టిపెడితే అనేక అక్రమ వసూళ్ళ దందా బైట పడుతుంది..
source :- http://telugumedianews.blogspot.in/

తెలుగు జర్నలిస్టులు,

0 కామెంట్‌లు
తెలుగు జర్నలిస్టులు, మీడియా టెక్నీషియన్ల అంతటి చేతగాని చచ్చు దద్దమ్మలు ఈ భూప్రపంచంలో ఉండరు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి... వాళ్ళ హక్కులు... వీళ్ళ హక్కులు... అంటూ రకరకాల కథనాలు వండివార్చే వీళ్ళు... తమ ఉద్యోగాలను యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా పీకేస్తే.... ఏడుస్తూ ఇళ్ళకు వెళ్తారు తప్ప "నీ యబ్బ... ఇదేమి అన్యాయం..." అని గొంతుఎత్తరు. పోరాటం అనేది రక్తంలో లేని పిరికి సన్నాసుల బ్యాచ్ ఇది.  ప్చ్. 

అందుకే...యాజమాన్యాల అడుగులకు మాడుగులొత్తుతూ దయా దాక్షిణ్యాలు లేకుండా... ఈ చిన్ని నా బొజ్జ శ్రీ రామ రక్ష అనికునే ఫాల్తు సీ ఈ ఓ లు, ఎడిటర్లు దాదాపు నాలుగు వేల మంది జర్నలిస్టులు, టెక్నీషియన్ల ఉద్యోగాలు పీకేశారు గత మూడేళ్ళలో. అయినా బాధితులు నోరు మెదపలేదు, జర్నలిస్టు సంఘాలు ఏమీ చేయలేదు. 
ఇలాంటి చేవచచ్చిన జనాలకు... కనువిప్పు/స్ఫూర్తి "టీవీ న్యూ" అనే ఛానెల్ లో చేరి వంచనకు గురైన కేరళ జర్నలిస్టులు. ది న్యూస్ మినిట్ కథనం ప్రకారం....కేరళ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గత ఏడాది జనవరిలో  అట్టహాసంగా ఈ ఛానెల్  ను ఆరంభించింది. అన్ని చోట్ల మాదిరిగానే... మంచి పాకేజ్ లకు ఆశపడి జర్నలిస్టులు, టెక్నీషియన్లు అందులో పొలోమంటూ చేరారు. ఒక్క ఏడాది లోనే అది మూతపడే పరిస్థితి దాపురించింది. 
నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు లేవు. 
ఇదే పరిస్థితి ఎదురైతే మన తెలుగు వీర జర్నలిస్టులు, టెక్నీషియన్లు ఏమి చేస్తారు? అది ఊహించడం పెద్ద కష్టం కాదు. కనిపించిన ప్రతి ఒక్కడికీ... తమ దుస్థితి గురించి చెప్పుకుని కన్నీరు కారుస్తారు కొందరు. మరి కొందరు... "ప్లీస్... కనీసం ఒక నెల జీతం ఇప్పించండి..." అని బతిమాలి అది తీసుకుని ఐ డీ కార్డు, ఫోన్ చిప్పు గప్ చిప్పుగా అప్పగించి ఇళ్ళకు పోతారు. మరి కొందరు కార్యశూరులు ప్రెస్ క్లబ్ కు వెళ్లి రెండు రోజులు మందు కొట్టి... మరుసటి వారం ఎవడివో కాళ్ళు పట్టుకుని మరొక ఛానెల్ లో తక్కువ జీతానికి చేరి ప్రజా సేవ మొదలు పెడతారు. 
దీనికి భిన్నంగా కేరళ జర్నలిస్టులు యజమానుల పరువు పంచనామా చేసి కొమ్ములు వంచే పనికి శ్రీకారం చుట్టారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు ఆ ఛానెల్ ఉద్యోగులు కొందరు నిరసనగా... తమ మకాంను ఆఫీసుకే మార్చారు... ఇళ్ళకు జీతాలు చెల్లించే స్థోమత లేక. స్టూడియో లోనే వంటా వార్పూ చేస్తున్నారు. 
అయ్యా తెలుగు జర్నలిస్టులూ...మీరు కూడా మనుషులే. మీకూ కొన్ని హక్కులనేవి ఏడుస్తాయి. పోరాడాలంటే కొన్ని పరిమితులు ఉంటాయని అందరికీ తెలుసు. అన్యాయాలకు వ్యతిరేకంగా కనీసం గొంతెత్తక పొతే మనం ఈ వృత్తికి పనికిరామని అర్థం. మరి మీ ఇష్టం
http://apmediakaburlu.blogspot.in/ సౌజన్యంతో 

జగన్ మీడియా సాక్షి లో మార్పుల కలకలం.

0 కామెంట్‌లు
నిత్యం ప్రజలకు వార్తలందించే మీడియా హౌసులు కూడా ఇప్పుడు ఆసక్తికరమైన వార్తలకు నిలయాలవుతున్నాయి. తమ సంస్థలో పట్టు కోసం మీడియాలోని పెద్ద తలకాయలు వేసే ఎత్తులు - జిత్తులు.. రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోవు. ఏమీడియాలోనైనా 2, 3 ఏళ్లకోసారి మార్పులు తప్పవు. ఇప్పుడు జగన్ సొంత మీడియా సాక్షిలోనూ అదే జరుగుతోంది.  

సాక్షి మీడియాలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కీలకపదవుల్లో ఉన్నవారిని కొన్ని అప్రాధాన్య విభాగాలకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సాక్షిలో పెద్ద తలకాయగా వ్యవహరిస్తున్న సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి ఇప్పుడు సంస్థపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తాజా మార్పుల్లో ఆయన అనుచరులకే పెద్ద పీట వేశారట. 

తాజా మార్పులపై చాలామంది సీనియర్లు అసహనంతో ఉన్నారట. కాకపోతే.. ఈ మార్పులకు భారతి ఆమోద ముద్ర ఉండటంతో ఏమీ అనలేకపోతున్నారట. ఇలాంటి అసంతృప్తిపరులు జాబితా పెద్దగానే ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తులుగా పేరున్న వారు కీలక స్థానాల్లో ఉండేవారు. తాజా మార్పుల కారణంగా.. వారికి చుక్కెదురయ్యిందట. 

ఈ మార్పుల కారణంగా చాలా మంది ప్రతిభ ఉన్నవారిని కూడా పక్కకుపెట్టడం అంతమంచిది కాదంటున్నారు.. ఈ మార్పులను దగ్గర నుంచి చూసిన కొందరు సీనియర్లు. అంతర్గతంగా ఎన్ని రాజకీయాలు ఉన్నా.. సంస్థ ప్రయోజనమే వాటి లక్ష్యం అయితే అందరికీ మంచిదంటున్నారు. మరి ఈ మార్పులు సాక్షిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు. http://www.apherald.com/ సౌజన్యం తో 

న్యూస్ ఛానళ్ల బుల్లి తెరపై భక్తి రసం

0 కామెంట్‌లు

న్యూస్ చానళ్లు ప్రారంభమైన మొదట్లో భక్తికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ భక్తికి ఉన్న మార్కెట్ చూశాక.. ఛానళ్ల కళ్లు తెరుచుకున్నాయి. క్రమంగా భక్తికి ఇచ్చే ప్రాధాన్యతా పెరిగింది. ఉదయం వేళల కార్యక్రమాలతో మొదలైన ఈ భక్తి హవా.. ఆ తర్వాత ప్రైమ్ టైమ్ కూ పాకింది. ఇదే అదనుగా కొన్ని ఛానళ్లు కొందరు స్వాములను టైమ్ స్లాట్లు కూడా అమ్మేసుకుంటున్నాయి. 

ఇక సీజన్లవారీగా కూడా న్యూస్ ఛానళ్లు బుల్లి తెరపై భక్తి రసం పారిస్తున్నాయి. ఈ సందడి కార్తీక మాసంలో మరీ ఎక్కువ. కార్తీక దీపంలో దీపాల సందడి తెలిసిందే. దీన్నే అస్త్రంగా మలచుకుంటున్నాయి ఛానెళ్లు. మొదట్లో ఈ ట్రెండ్ ఎన్టీవీ మొదలు పెట్టిందని చెప్పాలి. కోటి దీపోత్సవం పేరుతో భారీగా దీపోత్సవం నిర్వహించి సక్సస్ చేసింది. ఆ తర్వాత అదే బాటలోకి టీవీ 5 కూడా వచ్చింది. 

ఇప్పుడు ఈ రెండు చానళ్లు పోటాపోటీగా భక్తి కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. భారీ ఏర్పాట్లతో కోటి దీపోత్సవాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ స్వామీజీలను ముఖ్య అతిధులుగా రప్పించుకుని భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఐతే.. సాధారణంగా ఇలాంటి హంగామాలకు దూరంగా ఉండే ఈటీవీ న్యూస్ ఛానళ్లు కూడా ఇప్పుడు వీటి దారిలోనే  పయనిస్తున్నాయి. 

అటు ఆంధ్రాలోనూ.. ఇటు తెలంగాణలోనూ దీపోత్సవాలు నిర్వహిస్తోంది ఈటీవీ. ఎన్టీవీ, టీవీ5 స్థాయిలో భారీగా, హంగామాగా నిర్వహించకపోయినా.. ఈటీవీ కూడా ఈ దీపోత్సవాలు బాగానే నిర్వహిస్తోంది. విశేషమేమంటే.. వార్తలకు ముఖ్యమైన  ప్రైమ్ టైమ్ లో వార్తలను నిలిపేసి మరీ ఈ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. వార్తా ఛానళ్లు.. వార్తలను కూడా పక్కకు పెట్టి ఇలాంటి భక్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నాయంటే.. రాబడి ఆ స్థాయిలో ఉన్నట్టే కదా. http://www.apherald.com సౌజన్యం తో 

యువత పెడత్రోవ పట్టటంలో మీడియా పాత్ర,,, http://mallikomarneni.blogspot.in/ సౌజన్యం తో.

0 కామెంట్‌లు

యువత పెడత్రోవ పట్టటంలో మీడియా పాత్ర


భారతదేశంలో ఉన్నంత మంది యువత ప్రపంచంలో మరే దేశంలో లేరని గణాంకాలు చెబుతున్నాయి.. మరి అలాంటి యువతను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? దేశ ప్రగతిలో ఎంతగా భాగస్వాములను చేయాలి? ఎంతటి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి? ఇలాంటి పలు సవాళ్ళను ముందు పెట్టుకున్న మనదేశంలో, రాజకీయనాయకుల సంగతి సరే సరి, చివరకు మీడియా (ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా) కూడా సమాజ క్షేమాన్ని విస్మరించి చెడుపై ఎక్కువగా దృష్టిని పెట్టి యువతను నిర్వీర్యం చేయటంలో తన వంతు బాధ్యత నిర్వహించటం ఏ మాత్రం క్షమార్హం కాదు. దీనిపై ఒక చిన్న విశ్లేషణను ఈ వ్యాసంలో వివరిస్తాను.
నేడు టీవీ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పలు వార్తా చానెల్స్, రకరకాల సినిమా చానెల్స్ జనాన్ని అనునిత్యం చేరుతూనే ఉన్నాయి. అయితే, సమాజం నుంచి ప్రయోజనం పొందే వీరు, సమాజం పట్ల ఎంతవరకు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు? అంటే చాలా వరకు లేదనే చెప్పాలి. టీవీ చానెల్స్ నేటి యువతను పెడత్రోవ పట్టిస్తున్నాయని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. నేటి ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువగా సినిమా చుట్టూ తిరుగుతూ మంచి, చెడుల విచక్షణ మరచి యువతను లక్ష్యంగా చేసుకొని సొమ్ము చేసుకొంటున్నాయని అనటంలో సందేహం లేదు.

ఇటీవల టీవీ 9 లో ప్రసారం చేసిన ఓ వీడియో క్లిప్పింగ్ నేను పొరపాటున చూసాను. అది దేనిగురించి అంటే, ఏదో ఒక సిటీ మారుమూల ప్రాంతంలో, పండగ సందర్భంగా రికార్డింగ్ డాన్సులు జరిగాయని. దానికి కొందరు చోటా రాజకీయనాయకుల ప్రమేయం ఉన్నదని వార్త. ఇక ఆ వీడియోని చూపించటం మొదలుపెట్టారు. అమ్మాయిలు కొందరు అర్ధనగ్నంగా చేసే డాన్సులను ఏ మాత్రం మార్ఫింగ్ కూడా చేయకుండా, పలుసార్లు వారి శరీరాలను దగ్గరగా (జూమ్ ఇన్) చేసి మరీ చూపించారు. దీనివలన మనం ఏమి తెలుసుకోవాలి? మనం ఆ డాన్సులు జరిగిన ప్రదేశంలో లేము కదా? అయినాసరే ఎవరూ చూసినా, వారి ఖర్మ అన్నట్లు ప్రపంచమంతా ప్రసారం చేసి పడేసారు. అలాంటి వీడియోలు పిల్లలతో కలిసి వార్తలు చూసే వారెవరికయినా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. వారెవరో రికార్డింగ్ డాన్సులు చేయించుకొని పైశాచిక ఆనందం పొందితే, అలాంటి వార్తలను చెప్పి వదిలేయకుండా, వాటిని దృశ్య రూపంలో ప్రసారంచేసి పబ్బం గడుపుకున్న ఈ వార్తా ఛానల్ ఎవరి హితంకోసం ఉన్నట్లు. నా ఉద్దేశంలో, ఆ రికార్డింగ్ డాన్సులు పెట్టించిన వారికి, టీవీ 9 చానెల్ కి పెద్ద తేడా లేదు.

ఇటీవల అమెరికాలో జరిగిన తానా మహాసభల్లో, ఆంధ్రజ్యోతి MD వేమూరి రాధాక్రిష్ణగారితో జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమంలో, కొంతమంది ప్రవాస భారతీయులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఒక మిత్రుడు ఇలా అడిగాడు. అయ్యా! మీరు అప్పటి గవర్నర్ N. D తివారి గారి రాసలీలలను ప్రసారంచేసినప్పుడు దృశ్యరూపాలతోపాటు, ఎంతటి రసికుడవో అని ఓ సినిమా పాటను కూడా ప్రసారం చేసారు. ఇది ఎంత వరకు సబబు. మరీ అంతగా మీరు ఓ సినిమా తీసినట్లు ఎందుకు ప్రసారం చేసారు అని. అలాంటివి అంత అవసరమా అని ప్రశ్నించారు. దానికి రాధాకృష్ణగారు ఓ వితండవాదం చేసారు. ఎంతమంది వ్యక్తులు పోర్నోగ్రఫీ వెబ్సైట్లను చూడటంలేదు అని. దానిని అలా చూపిస్తేనే ప్రభావం ఎక్కువగా ఉంటుందని. ఈ సమాధానం విని నేను గతుక్కుమన్నాను. ఎవరో ఏదో చూసారని, చూస్తున్నారని సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సిన మీడియా కొంత నిర్లజ్జగా వ్యవహరించవలసి రావటం నిజంగా మన దురదృష్టం. సినిమాలలో చూపిస్తున్నారని, ఇంటర్నెట్లో చూస్తారని ఇక టీవీ చానెల్స్ కూడా ఇలా దిగజారటం జనానికి ఏ సందేశం అందిస్తుంది?
నాకు ఎక్కువ అసహ్యం కలిగించే విషయం ఏమిటంటే దాదాపు అన్ని టీవీ చానెల్స్ వారు ప్రసారం చేసే సినిమా కార్యక్రమాలలో పలాని హీరో లేదా హీరొయిన్ నేటి యువతకు కలల రాకుమారుడు/రాణి అని ఎలాంటి సిగ్గు లేకుండా ఊది పారేయటం. ఇది ఒక రకంగా చెప్పాలంటే, యువతను ఎవరికో బానిసలు అయినట్లు చూపించటం. ఇలాంటి పరిణామం చాలా బాధాకరం. పలాని హీరో లేదా హీరొయిన్లకు చాలా అభిమానులు ఉన్నారని చెప్పటం వరకు సబబు. కాని యువతను సినిమాయే ప్రపంచంగా బ్రతుకుతున్నారని చూపించటం ఇప్పటికే పలువురు యువకులను పెడత్రోవ పట్టించింది. ఇవేవీ యువతకు తోడ్పాటు కలిగించే ప్రసారాలు కావు. వారి వయసులో ఉన్నఆకర్షణను సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో దాదాపు అన్ని చానెల్స్ పోటీపడుతున్నట్లున్నాయి. యువతను ఒక సినిమా వ్యక్తిని ఆరాధించే స్థాయికి ఎందుకు తీసుకొస్తున్నారు? దీనికి మీడియానే ప్రధమ ముద్దాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. నా విద్యార్ధులు చాలామంది నన్ను ఓ సోషల్ నెట్ వర్క్ సైట్లో కలుస్తారు. వారిలో కొద్దిమంది వారి ప్రొఫైల్ ఫోటోలో వారి బొమ్మకు బదులు ఏదో ఒక హీరో బొమ్మ లేదా హీరొయిన్ బొమ్మ పెడుతూ ఉంటారు. దీనికి అర్థం ఏమిటి? అంటే వారిని వారే ఇష్టపడటం లేదనా? లేక వారికంటే ఆ హీరో లేదా హీరొయిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారనా? నాకెప్పటికీ అర్థం కాలేదు. వ్యక్తిపూజకు దూరంగా ఉండటం సమాజానికి చాలా మంచిది. వ్యక్తికంటే అతని వ్యక్తిత్వాన్ని గౌరవించటం నేర్చుకోవాలి.
కనిపించిన ప్రతి యువకుడి/యువతి వద్దకు పొలోమని పరుగెత్తి, వారి ముందు మైకుపెట్టి ఏదో ఒక విషయంపై స్పందించమంటే, వారికి నేలపై నడుస్తున్నట్లు గుర్తుండదు. అలాంటి ఫోకస్ రావాలన్నా కూడా ఒక అర్హత ఉండాలి. లేదంటే, మీడియా గుర్తిస్తుందని దుందుడుకుగా వ్యవహరించే యువతకు నేడేమీ కొదువలేదు.
ఏ విషయమైనా చెడ్డది కావటమే దాని అర్హత, ఇక మీడియా చెలరేగిపోతుంది. దానిని పదే పదే చూపించి బుర్ర తొలిచేస్తుంది. డ్రగ్స్ కేసులో చిక్కిన/ఆరోపణలున్న యువహీరోలతో ఇంటర్వ్యూలు, సెక్స్ రాకెట్లలో చిక్కిన భామామణుల స్పందనలు, తప్ప తాగి దురుసుగా వాహనం తోలిన ఓ చవకబారు హీరో క్లిప్పింగ్లు, నరహంతకులపై ఫోకస్, వాటిపై ప్రత్యక కార్యక్రమాలు ఎవరి హితం కోసం? వార్త తెలియజేయటం మీడియా బాధ్యత, అంతేకాని అర్హత లేని ప్రతి చెత్త విషయంపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి జనంపైకి వదలటం భావ్యం కాదు. సమాజ హితంకోసం, ప్రతి క్షణం పాటుపడే మహానుభావులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అలాంటి వారితో ఇంటర్వ్యూలు ప్రసారం చేయవచ్చు. వారిని ఆదర్శంగా తీసుకొమ్మని చెప్పవచ్చు. అలా జరిగినప్పుడే మంచికి, చెడుకు తారతమ్యం తెలుసుకొని యువత పురోగమిస్తుంది. ప్రొద్దున లేచిన దగ్గరనుంచీ, 24 గంటలూ చెడుపై దృష్టి పడకుండా నేటి యువతను కాపాడుకోనవలసిన బాధ్యత మనందరిపై ఉంది.
మన దేశ సంస్కృతి, సంప్రదాయాలపై ఈ టీవీ చానెల్స్ వారికి ఏ మాత్రం అవగాహన లేదు అనిపించేలా వీరు ఏదైనా పండుగ సందర్భంగా చేసే ప్రసారాలు ఉంటాయి. ప్రతిదీ ఏదో ఒక సినిమాతో ముడిపెట్టి ప్రేక్షకుల చెవులను మెలిపెడతారు, బుర్ర తోలిచేస్తారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి సమాజానికి ఎంతగానో మేలు చేస్తాడు. వాటిని తరతరాలకూ అందించే బాధ్యత అందరూ తీసుకోవాలి. ఒక పండుగ వస్తే, దాని విశిష్టత ఏమిటి? ఎందుకు జరుపుకోవాలి ? అలాంటి పిండి వంటలనే ఎందుకు చేయాలి? వాటికున్న చారిత్రిక నేపధ్యం ఏమిటి అనేవి తెలియజెప్పాల్సిన బాధ్యతను తుంగలో తొక్కి ఎంతసేపూ సినిమా కార్యక్రమాలతో కాలక్షేపం చేయమని జనులపై రుద్దటం శక్తివంతమయిన మీడియా చేయవలసిన పని కాదు. అందుకే పెద్దలను గౌరవించలేని విష సంస్కృతి ఇప్పుడు త్వరత్వరగా ప్రబలుతుంది. ఇది ఒక సమాజ పతనానికి దారి తీస్తుంది. కొన్నాళ్ళకు చేతినుండా డబ్బు మిగులుతుంది కాని, ఈ యువతకు దారి చూపే వారే కరువవుతారు. అలా కాకుండా ఉండాలంటే, ఈ చానెల్స్ సాధ్యమయినంత వరకు చూడకపోవటమే మంచిది. సిని"మాయే" ప్రపంచం/జీవితం కాదని అందరూ యువతకు ప్రభోదించాలి. అప్పడే యువత తనకున్న బలహీనతలను తొలగించుకొని త్వరత్వరగా భారతదేశం ఒక బలమయిన శక్తిగా ఎదగడానికి తోడ్పడుతుంది.  http://mallikomarneni.blogspot.in సౌజన్యం తో..